Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కరోనా వల్ల బయట పరిస్థితులు బాగా లేనప్పటికీ మా 'వకీల్‌సాబ్' చిత్రానికి మాత్రం ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. ప్రేక్షకులు అందించిన ఈ ఘన విజయం మాపై మరింత బాధ్యతని పెంచింది' అని అంటున్నారు దర్శక, నిర్మాతలు శ్రీరామ్ వేణు, దిల్‌రాజు.
పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా రెండో వారం ప్రదర్శితం అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ, ' ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలకు కావాల్సిన సినిమా. మా సినిమా మహిళలకు బాగా దగ్గరైంది. బయట పరిస్థితులు బాగా లేకున్నా మా సినిమాకి మాత్రం ఆదరణ తగ్గడం లేదు. ఈ విజయం ప్రేక్షకులు మాకూ, తెలుగు చిత్ర పరిశ్రమకు ఇచ్చిన బహుమతి. మంచి సినిమా చేస్తే, ఆ సినిమా విజయానికి ఏ అడ్డంకీ ఉండదని తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. మీరు ఇచ్చిన ఈ విజయం జీవితాంతం మా మనసుల్లో నిలిచిపోతుంది' అని చెప్పారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, 'ఈ సినిమా మొదలుపెట్టిన రోజే అనుకున్నాం, ఇది ఎంత పెద్ద సినిమా అయితే అంత మనం విజయం సాధించినట్లు అని. ఎంత పెద్ద సినిమా అంటే వసూళ్ల పరంగా కాదు, ఎంతమంది ఆడియెన్స్‌కు రీచ్ అయ్యింది అనేది మా లక్ష్యం. ఈ కొవిడ్ టైమ్‌లో కూడా ఎంత మంది చూడాలో, అంత కంటే ఎక్కువే చూస్తున్నారు. థియేటర్లకు రిపీటెడ్‌గా వస్తున్నారు. వయసులో పెద్దవాళ్ళు థియేటర్లకు వెళ్లడానికి భయపడితే ఓటీటీ లేదా టీవీలో సినిమాని ఒకటికి పది సార్లు చూస్తారనే నమ్మకం మాకుంది. ప్రజలకు సినిమా రీచ్ అవడంలో, రెవెన్యూ విషయంలో అనుకున్నది సాధించాం. ప్రేక్షకులు, సొసైటీలోని పెద్దవాళ్లు, ఇండిస్టీ స్టార్స్, ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాని అప్రిషియేట్ చేశారు. ప్రతి సినిమా విజయం మనకో బాధ్యత నేర్పుతుంది. ఈ సినిమా విజయం మాకు మరింత బాధ్యత ఇచ్చింది. ఇలాంటి మంచి సినిమాలను జాగ్రత్తగా చేయాలని, చేస్తే ప్రశంసలతోపాటు పేరు వస్తాయని మరోసారి గుర్తు చేసింది. ఇకపై మరింత బాధ్యతతో సినిమాలను చేస్తాం' అని తెలిపారు.