Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్.వి.జి మూవీజ్, ఎస్.వి.ఎల్.ఎంటర్ప్రైజెస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి), తలారి వినోద్ కుమార్ ముదిరాజ్, శ్రీనివాస్ మామిడాల, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ 'తప్పించుకోలేరు'.
'కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం' వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) తాజాగా తెరకెక్కించిన ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన తలారి వినోద్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ, 'ఈ చిత్రంతో నిర్మాతగా మారుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విడుదలయ్యాక మా దర్శకుడు 'ఆర్.వి.జి' పేరు మారుమ్రోగుతుంది. సినిమా అంత బాగా వచ్చింది. వి.ఎస్.పి.తెన్నేటి గారి మాటలు, పాటలు, రాజేష్ మ్యూజిక్.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ సినిమా నిర్మాణం మంచి సంతృప్తినివ్వడంతో ఈ సినిమా విడుదలకు ముందే ఉగాది సందర్భంగా మా ఆర్.వి.జి దర్శకత్వంలోనే మరో సినిమాకి కూడా శ్రీకారం చుట్టాం' అని తెలిపారు.
ఏ.వి.ఎల్.నరసింహం, నిట్టల, మల్లాది భాస్కర్, మేజర్ ఆర్.వి.సుబ్బారావు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: వి.ఆర్.కంచి, ఛాయాగ్రహణం: ప్రసాద్ కె.నాయుడు, సంగీతం: రాజేష్ రాజ్.టి, మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్-శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్, రచన-దర్శకత్వం: రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి).