Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్బాస్ 4 టైటిల్ గెలుచుకోలేకపోయినప్పటికీ మన ఇంట్లో వ్యక్తి అనుకునేంతగా సయ్యద్ సోహెల్ ప్రతి కుటుంబానికి దగ్గరయ్యాడు. బాగ్బాస్ 4 షో తర్వాత సయ్యద్ సోహెల్ తన కొత్త చిత్రాలను తనదైన పంథాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు. బెక్కం వేణుగోపాల్ లక్కీ మీడియా, గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్లలో రూపొందబోయే ఓ ఆసక్తికరమైన చిత్రానికి ఆయన గ్రీన్ సిగల్ ఇచ్చారు. 'ఈ చిత్రం ఒక సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉండబోతుంది. సయ్యద్ సోహెల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.