Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'థాంక్యూ బ్రదర్'. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనె 30న విడుదలకు సిద్ధమైంది. ఓ యువకుడు, గర్భవతిగా ఉన్న మహిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. దీంతో వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు?, వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు వెంకటేష్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్, రానా దగ్గుబాటి సహా నెటిజన్స్ అందరినీ ఈ ట్రైలర్ ఆకట్టుకుంది.
ఈ నెల 30న విడుదల కానున్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 'డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన 'థాంక్యూ బ్రదర్' చిత్రం క్లైమాక్స్‌ను అసలు మిస్ చేసుకోకండి' అని చైతన్య ట్వీట్ చేశారు. 'ఆహా' సమర్పణలో ఆసక్తికరంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎగ్జయిటింగ్ క్లైమాక్స్‌తో రూపొందిన ఈ చిత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అద్భుతమైన విజువల్స్, టాలెంటెడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను చివరి నిమిషం వరకు ఎంగేజ్ చేస్తుంది' అని చిత్ర బృందం తెలిపింది. అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, ఆదర్శ్ బాలకష్ణ, మోనికా రెడ్డి, హర్ష చెముడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ రాపర్తి, నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, సంగీతం: గుణ బాలసుబ్రమణియన్.