Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మహా సముద్రం'. అజరు భూపతి ఈ చిత్రానికి దర్శకుడు. హీరో సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రంలో అతని ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో శర్వానంద్ కొంచెం అగ్రెసివ్ లుక్‌లో కనిపించగా, సిద్ధార్థ్ మాత్రం ప్రశాంతంగా కనిపిస్తున్నారు. బ్లూ కలర్ షర్ట్‌లో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకర్షణీయంగా ఉంది. ఇంటెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరి, అనూ ఇమాన్యూల్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. రాజ్‌తోట సినిమాటోగ్రాఫర్‌గా, కేఎల్ ప్రవీణ్ ఎడిటర్‌గా, కొల్ల అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా ఈ ప్రాజెక్ట్‌కి పని చేస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్19న విడుదల చేయడానికి మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కో- ప్రొడ్యూసర్: అజరు సుంకర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, ఎడిటర్: ప్రవీణ్ కేఎల్, యాక్షన్: వెంకట్, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, రచన-దర్శకత్వం: అజరు భూపతి.