Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ సూపర్ స్టార్ మరియు యూత్ ఐకాన్ రణవీర్ సింగ్ ఒక సాంస్కృతిక ప్రతిరూపం – ఒక నటుడు. ఒక ప్రామాణిక ఫ్యాషన్ ఐకాన్, ఇండియన్ హిప్ హాప్ ముఖం, ఒక ఆర్టిస్ట్ ఎంటర్ప్రెనర్- అతడు ఇండియాలో ఎంటర్టైన్మెంట్ రంగంలో ఒక నిజమైన డిజ్రప్టర్ మరియు నిజమైన బ్లూ గేమ్ చేంజర్. ఎంటర్టైన్మెంట్ వ్యాపార రంగంలో ఒక ర్యాంక్ ఔట్ సైడర్ మరియు సెల్ఫ్-మేడ్ బిజినెస్ మాన్, రణవీర్ తన అవిశ్వసనీయమైన తరం అంతరాన్ని చూపించే పెర్ఫార్మన్సుల ద్వారా ఒక దశాబ్ద కాలంలో భారతీయ సినిమా చరిత్రలో తన పేరుని లిఖించుకున్నడు. అసాధ్యం అనేది ఏమీ కాదని నమ్మటం ద్వారా తాను జీవితంలో ప్రతి ఒక్కటి సాధించానని అతడు అంటున్నాడు. అతడి నిర్భయత్వం మరియు ఉగ్రరూపం, దేశంలో తమ శక్తికి మించి ఉవ్వెత్తున లేవాలనుకునే మరియు తమ మెరిట్ చుట్టూ ఉన్న గ్లాస్ షీల్డ్ బద్దలకొట్టాలని ఆశించే దేశంలోని యువత మనసులో గాఢంగా నాటుకుని ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అతడి విశిష్టమైన, యథార్థమైన మరియు పూర్తిగా సాంప్రదాయపధ్ధతికి విరుద్ధమైన పబ్లిక్ వ్యక్తిత్వం స్టీరియోటైప్ నుంచి బయటకొచ్చి, సాంస్కృతిక ఆశాభావాల నుంచి బయటకొచ్చి, నేటి పాప్ కల్చరు కి కూడా కొత్త రూపం ఇస్తుంది.
ఒక నిజమైన యువ ఐకాన్ గా, మొత్తం దేశం కేంద్రీకరించిన ఒక స్పాట్ లైట్ అతడి మీద ఉంది. అతడు మ్యూజిక్ పరిశ్రమలో కూడా ప్రాముఖ్యత కొరకు ఆర్టిస్ట్ కలెక్టివ్ ఇంక్ లింక్ ఎంచుకున్నారు. ఇది దేశం మొత్తం మీద, టేలంట్ కలిగిన మ్యుజీషియన్స్ ను సపోర్ట్ చేసి, వారు గ్లోబల్ స్టేజ్ లో బ్రైట్ గా షైన్ కావటానికి సహాయపడే ఒక ప్లాట్ ఫార్మ్. అసాధ్యాలను సాధించే అవకాశాలను ఆయన ఎల్లప్పుడూ ఎలా నమ్ముతారు అన్నది మేము రణవీర్ సింగ్ తో చర్చించటం జరిగింది.
ఇప్పుడు మీరు జనం సూపర్ స్టార్. అయితే మీ కెరీర్ ప్రారంభంలో మీరు అనేక తిరస్కారాలు ఎదుర్కొన్నారు. నిస్సందేహంగా ఒక పోరాట వ్యక్తిగా మీరు ప్రారంభించిన సమయం మరియు మీ దృష్టి బహుమతి మీద మరియు మీ పట్టుదల అసాధ్యం అనేది ఏమీ కాదని నమ్మే విశ్వాసం మీద ఉన్నప్పటి పరిస్థితి గురించి మాకు చెప్పండి.
రణవీర్: “నా పోరాట సంవత్సరాలలో, వేరు వేరు పాయింట్స్ మరియు అనేక సందర్భాలలో, అక్కడ ఆశించేదేమీ లేదని నేను అనుకున్నాను. విశాలమైన విస్తృతమైన ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో డోర్ లోపల ఒకరి అడుగు పెట్టటం అసాధ్యం అని అనిపించింది. కానీ నేను నిలబడ్డాను – నేను ఆకలిగా ఉన్నాను మరియు మూర్ఖుఢ్ని అంటే రెండూ అని మీరు అనవచ్చు. నేను నాలోని శక్తిని మరియు నాలోని సామర్థ్యాని అన్నిటి కంటె ఎక్కువగా నమ్మాను. నాకు ఏదీ లేనప్పుడు నేను మళ్లీ వెనక్కి వచ్చినప్పుడు, నా పోరాటంలో అదే విధంగా కొనసాగిన పట్టుదల మరియు చైతన్య పూరితమైన వర్క్ ఎథిక్స్ ముఖ్యగుణాలుగా కనిపించేవి. అది ఎంత లాంగ్ షాట్ అన్నది నాకు తెలిసేది. కానీ నమ్మకమే శ్వాసగా నేను ముందుకు ఉరికేవాడిని. చాలా కాలం వరకు కనుచూపు మేరలో మంచి లీడ్ ఏదీ కనిపించనప్పుడు, నెలల తరబడి ఫోన్ రింగ్ కానప్పుడు, నా నమ్మకానికి ఛాలెంజ్ ఎదురయ్యేది. కానీ నేను ప్రయత్నిస్తున్నది అసాధ్యం అన్న ఆలోచనను నేను మనసులోంచి తీసేసేవాడిని. అత్యంత పరీక్షాసమయాల మీద నా దృష్టి నిలిపేవాడిని. నా పని జరగాలని నే్ను ప్రపంచం మీద సుమారుగా ఒత్తిడి పెంచేవాడిని. నా సింగిల్-మైండెడ్నెస్ మరియు నిర్ణయం వరసగా ఫలించేవి. నా కల నిజంగా మారేది. అప్పటి నుంచి ప్రతి రోజు నేను ఒక కలలో జీవించేవాడిని.”
మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేరినప్పుడు, ఒక నటుడికి ముఖ్యంగా కావలసిన లుక్స్ లేవని, మీకు ఫిల్మ్ లైనేజ్ అయినా లేదని మీ గురించి అంటారు. ఇప్పుడు మీరు ఇండియాకు ఒక గ్లోబల్ యూత్ ఐకాన్. మీ సూపర్ స్టార్డమ్ జర్నీలో మీరు నేర్చుకున్న అతిపెద్ద పాఠాలు ఏమిటి?
“యంగ్ యాక్టర్లు, ముఖ్యంగా ‘అవుట్ సైడర్లు’ తమ పోరాటాన్ని ఎలా నడపాలని సలహా అడుగుతూ నా దగ్గరకు వచ్చినప్పుడు, వాళ్లకు నేను చెప్పేది, “దీనిని ఒక సరియైన కారణం నిర్వహించటానికి చేయండి. మీరు పెర్ఫార్మన్స్ ను ప్రేమిస్తున్నారు, అందుకే ఇది మీరు చేస్తున్నారు.” ఈ ఆర్ట్ మరియు ఎంటర్టైన్మెంట్ బిజినెస్ వైపు బాగా డబ్బు మరియు పేరు వస్తుంది కాబట్టి ఆకర్షించబడి రావద్దని నేను వారికి సలహా ఇచ్చేవాడిని. ఇవి అస్థిరం, ఇవి సాలీడులా పట్టి బిగించేవి- జస్ట్ ట్రాపింగ్స్. కాబట్టి మీ పనితనాననికి ప్రాధాన్యత ఇచ్చి, పెర్ఫార్మన్స్ ను ప్రేమ మరియు ఆనందంతో చేయండి. కాలక్రమంగా నేను నేర్చుకున్న మరొక విషయం అధెంటిసిటీకి అధిక జీవశక్తి ఉంటుంది అని. మీరు నిజంగా కాని విషయానికి గట్టిగా ప్రయత్నిస్తే, మీరు మీకు సేవ చేసుకోలేరు. మీరెవరో దాని కోసం మీరు నిలబడితే, నిర్ణయించబడరేమో అన్న భయం మీరు వదిలిన తర్వాతనే మీరు అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ కాగలుగుతారు. మీరు మీ శక్తి చూపగలరు‘ అని వారికి చెబుతాను. ఒరిజినల్ గా ఉండండి, మీ సొంత విశిష్టత చూపండి. రిస్కులు తీసుకుంటూ ఉండటం కూడా నను నేర్చుకున్న మరొక విషయం. రిస్క్ ఎంత పెద్దదయితే, ఫలితం అంతపెద్దది. ఈ ప్రాసెస్ లో మీరు తడబడ వచ్చు కానీ, ఫెయిల్ కారు. జీవితంలో పరాజయాలు ఉండవు, పాఠాలే ఉంటాయి అన్నది నా నమ్మకం. ”
మీకు ఏదీ అసాధ్యం కాదు అని మీ కెరీర్ నిజంగా చూపిస్తున్నా, మ్యూజిక్ ఇండస్ట్రీలో ర్యాంక్ ఔట్ సైడర్స్ గా ఉన్న ఫెలో డ్రీమర్స్ కు మీరు ఇప్పుడు పెద్ద ప్లాట్ ఫార్మ్ అందిస్తున్నారు. ఫెలో ఔట్ సైడర్ల పక్కన ఒక ఔట్ సైడర్ నిలబడాలి అని మీరు నిర్ణయించినప్పుడు, ఆ క్షణం గురించి మాకు చెప్పండి.
“ఒక వ్యక్తిలో సుదీర్ఘ ఆకాంక్ష మరియు జ్వాల ఉంటుంది. ఆ పిపాస తో నిరంతరం శ్రమించి, మెరిసే క్షణానికి చేరుకుంటాడు. కాని అనేక సార్లు ఈ పజిల్ లో మిస్సింగ్ పీస్ అనేది ‘అవకాశం’. ఆ అవకాశాలు లేక పోవుట వలన నా పోరాటం అంత కష్టమైనది అయింది. ఫెలో డ్రీమర్లకు అది అందించటమే నా కోరిక. పిపాస జ్వాలతో మరుగుతున్నయువ సృజనాత్మకతకు అవకాశాలు కల్పించటం, వారి టాలెంట్ షోకేస్ కు ఒక ప్లాట్ ఫార్మ్ వారికి ఇవ్వటం, ఇది నేను వారికి తిరిగి ఇవ్వగలిగే నా పద్ధతి. నేను అందుకున్న ఆశీర్వాదాలను వారికి అందజేయటం నా ఆశయం. ప్రపంచానికి నా కృతజ్ఞతను చూపించే ఈ పద్ధతి నా మనసు మెచ్చినది.”
మీ ప్రారంభం లో మీరు ఒక ట్రూ బ్లూడాగ్, ఇప్పుడు మీరు 83, గల్లీ బాయ్, జయేష్ భాయ్ జోర్దార్ వంటి పిల్మ్ అండర్ డాగ్స్ కి మీరు ఛాంపియన్ చేస్తున్నారు – మీరు ఈ పెర్ఫార్మన్సులు సాధించుటకు, అసాధ్యం ఏదీ కాదు అనే మీ నిజ జీవిత ప్రయాణంలో ఏమి గ్రహించారు?
“ప్రతి ఒక్క వేరు వేరు పాత్రకు, ప్రతి ఒక్కరు తమ అనుభవం బ్యాంక్ నుంచి కొంత తీసుకుని, ఆ చిత్రీకరణ యథార్థంగా, ఆర్ద్రతతో, నిజాయితీగా ఉండేలా చూడాలి. నేను నటించిన అండర్ డాగ్ కేరక్టర్లు నొక్కి చెప్పుతాను, ఎందుకంటే నేను నా జీవన ప్రయాణంలో అలాంటివి చూసాను. ‘గల్లీ బాయ్’ లో ఒక డైలాగ్ ఉంది, దానిని హిందీలోంచి ఇలా అనువదించారు : “ నా వాస్తవానికి నా కలను మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. నా నిజాన్ని నా కలకు తగినట్లుగా మార్చుకుంటాను.” ఈ సెంటిమెంట్ ను నా మనస్సులో గట్టిగా నిలుపుకున్నాను. ఈ కేరక్టర్లు అన్నిప్రతికూల పరిస్థితులలో తమ సత్తా చాటాల్సి ఉన్నప్పుడు, ఆ పోరాటాన్ని నేను దృఢంగా చూపాను. గల్లీ బాయ్ లో, మురాద్ అసాధ్యాన్ని సాధిస్తాడు. 83 లో కపిల్ యొక్క డెవిల్స్ అసాధ్యాన్ని సాధించటం జరుగుతుంది. నా ప్రయాణంలో నేను చూసినవి కాబట్టి వీటికి నేను న్యాయం చేసాను. ఆ నిరాశ నాకు తెలుసు, ఆ కోపం నేను అనుభవించాను, ఆ ఆశాభంగం నేను ఎదుర్కున్నదే. ఆ క్షుబ్ద నేను ఎరిగినదే... అన్నీ తీవ్రమైన విధంగా, ఎందుకంటే నేను వాటిని అనుభవించాను. నిజంగా..” .
ఆదిదాస్ రణవీర్ ను ఫీచర్ చేస్తూ అసాధ్యం ఏదీ కాదు అనే కాంపైన్ ప్రారంభించారు, కళ్ల నిండా కలలతో ఉన్న ఒక యువకుని ప్రయాణం హైలైట్ చేస్తూ, అసాధ్యాలను వెంటాడి, ఇండియాలో సూపర్ నోవా అవుతాడు. రణవీర్ యొక్క చిత్రసీమ ప్రయాణం 10 వ సంవత్సరంలో ఈ గ్లోబల్ కాంపైన రిలీజ్ కావటం ఒక విశేషం. అతడు ఎలా పాప్ కల్చర్ ను షేప్ చేసిందీ చూస్తాం మరియు ఇండియన్ సినీమేటిక్ చరిత్రలో అంత్యంత ప్రియమైన ఆన్-స్క్రీన్ కేరక్టర్లు అందించుట ద్వారా ఇది నిజంగా ఒక మరుపురాని మధుర క్షణం.