Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మైండ్ గేమ్ నేపథ్యంతో తెరకెక్కిన సినిమా 'శుక్ర'. అరవింద్ కష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా నటించిన ఈ చిత్రానికి సుకు పూర్వజ్ దర్శకుడు. రుజాల ఎంటర్ టైన్ మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా 'ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మీట్'ను చిత్ర బృందం సోమవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ,'ప్రీ రిలీజ్ గ్రాండ్‌గా చేద్దామనుకున్నాం. చాలా మంది గెస్ట్‌లను పిలుద్దాం అని ప్లాన్ చేశాం. అయితే ఇప్పుడున్న టైమ్ ఎలా ఉందో మీరు ఊహించుకోవచ్చు. అందుకే ఓట్ ఆఫ్ థాంక్స్ పేరుతో ప్రీమియర్ షోలకు, ట్రైలర్, పాటలకు మీరు ఇచ్చిన రెస్పాన్స్‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. 'శుక్ర' అంటే సినిమాలో డైమండ్ అని మీనింగ్ చెబుతున్నాం. సినిమా గతంలో ఏ సినిమాతో పోలిక లేకుండా ఉంటుంది. కొత్తగా ఉంటుంది. మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు థియేటర్లు మూసివేత అంటున్నారు కానీ ఏది ఏమైనా మేం మా సినిమాని విడుదల చేయడానికే నిర్ణయించుకున్నాం. ఎన్ని థియేటర్స్, ఎన్ని మల్టిప్లెక్స్‌లు దొరికితే అన్నింటిలో విడుదల చేస్తాం. సినిమా మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది రెగ్యులర్ సినిమా కాదు' అని తెలిపారు.