Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాథి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. కరోనా సెకండ్ వేవ్ విజంభిస్తున్న ప్రస్తుత తరుణంలో సీసీసీ మరో బహత్కర కార్యక్రమాన్ని చేపట్టింది. 45 ఏళ్లు వయసున్న సినీ కార్మికులకు, సినిమా జర్నలిస్ట్‌లకు అపోలో ఆసుపత్రి సౌజన్యంతో
వ్యాక్సిన్ తీసుకునే అవకాశాన్ని సీసీసీ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రూపంలో తెలిపారు. ఈ గురువారం నుంచి నెల రోజులపాటు వ్యాక్సిన్ అంద జేయనున్నట్లు ఆయన చెప్పారు. 24 శాఖల యూనియన్లలో పేరు నమోదు చేసుకుని అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, షెడ్యూల్ వారీగా అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్ పొందాలని ఆయన కోరారు. సభ్యునితోపాటు తమ జీవిత భాగస్వామికి కూడా వ్యాక్సిన్ ఉచితమని చిరంజీవి తెలిపారు. అలాగే మూడు నెలలపాటు ఉచితంగా డాక్టర్లను సంప్రదించవచ్చని, మందులను కూడా రాయితీతో పొందవచ్చని చిరంజీవి పేర్కొన్నారు.