Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'చిత్రపటం'.
పార్వతీశం, శ్రీవల్లి, శరణ్య, నరేన్, పోసాని, బాలాచారి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను అగ్ర నిర్మాత ఆర్.బి.చౌదరి విడుదల చేశారు. టీజర్ బావుందని ప్రశంసిస్తూ, చిత్ర బందానికి ఆయన శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ, 'ఇంటర్నెట్లో మనిషికి కావలసినవి చాలా దొరుకుతున్నాయి. దొరకనిదల్లా ఎమోషన్ మాత్రమే. దాన్ని ఈ చిత్రంలో ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాం. తండ్రికీ కూతురికి మధ్య సాగే కథతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో ఏడు పాటలు ఉన్నాయి. వాటికి నేనే సాహిత్యం అందించడంతో పాటు సంగీతాన్ని సమకూర్చాను. పొయెటిక్‌గా ఉంటూనే అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్నాయి. మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడిగా నాకిది రెండో చిత్రం. ఇప్పటికే నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి' చాలా బాగా వచ్చింది. మరో రెండు చిత్రాలు కూడా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాను' అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: వినోద్, నిర్మాత: పుప్పాల శ్రీధరరావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం: బండారు దానయ్య కవి.