Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఓకే బంగారం', 'మహానటి', 'కనులు కనులను దోచాయంటే' వంటి విజయ వంతమైన చిత్రాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న కథానాయకుడు దుల్కర్ సల్మాన్.
ఆయన హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియడ్ లవ్ స్టోరీగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించి వీడియో గ్లిమ్స్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మద్రాస్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు తెలిపింది. 'ప్రేమ కోసం ఆ శ్రీ రాముడి యుద్ధం చిరస్మరణీయం. త్వరలో తన ప్రేమకావ్యంతో మన ముందుకు మా లెఫ్ట్‌నెంట్ రామ్.. చెడుపై మంచి తప్పకుండా గెలుస్తుంది అంత వరకూ సేఫ్‌గా ఉండండి' అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం కాశ్మీర్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి, నిర్మాతలు: స్వప్న సినిమా, సమర్పణ: వైజయంతి మూవీస్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రాఫర్: దివాకర్ మణి, ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు.