Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, మేర్లపాక గాంధీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'మాస్ట్రో'. రీసెంట్గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శ్రీరామ నవమి శుభాకాంక్షలతో ఈ సినిమా నుండి సరికొత్త పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
'నభా నటేష్ స్కూటీ నడుపుతూ ఉండగా, నితిన్ ఆమె వెనక కూర్చుని కలర్ఫుల్గా ఉన్న ఈ రొమాంటిక్ పోస్టర్‌కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. నితిన్ 30వ సినిమాగా నటిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా ఓ కీలక పాత్రని పోషిస్తోంది. ఈ ఏడాదిలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ఇదొకటి. ఇటీవల 'రంగ్‌దే' సినిమాతో హీరో నితిన్ విజయం సాధించారు. ఈ చిత్రంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ తమన్నా భాటియా, నభా నటేష్ భాగమవ్వడం విశేషం. 'భీష్మ' మూవీకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మహతి స్వరసాగర్ ఈ చిత్రానికీ సుమధుర బాణీలను సమకూరుస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీకి జె.యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి నిర్మాతలు: ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి, సమర్పణ: రాజ్‌కుమార్ ఆకెళ్ల, మ్యూజిక్: మహతి స్వరసాగర్, సినిమాటోగ్రఫీ: జె.యువరాజ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: సాహి సురేష్.