Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాహుల్ కష్ణ, ప్రియాంక నోముల హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'అగ్రజీత'. సందీప్ రాజ్ దర్శకత్వంలో సందీప్ రాజ్ ఫిలిమ్స్, వాసవి త్రివేది ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఆస్ట్రేలియాలోని డాండెనాంగ్ సిటీలో ఉన్న శివ విష్ణు ఆలయంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రాజ్ మాట్లాడుతూ, 'ఇదొక భిన్నమైన కథ. ఒక జీవి మరణం తర్వాత, తన జ్ఞాపకాలను అణువు ద్వారా మరో జీవిలోకి పంపే ఒక శాస్త్రీయ కథ. మంచి కథతో, మంచి గ్రాఫిక్ విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇప్పుడొస్తున్న ఎన్నో సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా వినూత్నంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని పూర్తిగా ఆస్ట్రేలియాలోనే చిత్రీకరిస్తాం. రాహుల్ కష్ణ, ప్రియాంక నోముల జంటగా నటిస్తున్నారు. వీరి పాత్రలు ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పటికే రెగ్యులర్ చిత్రీకరణను ఆరంభించాం' అని తెలిపారు.
రాహుల్ కష్ణ, ప్రియాంక నోముల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా మాన్ - ఎడిటింగ్ : సందీప్ రాజ్, సంగీతం : సిద్ధార్థ్ వాట్కిన్స్, కథ- కో డైరెక్టర్ : కష్ణ రెడ్డి లోక, స్క్రీన్ ప్లే - డైరెక్షన్ : సందీప్ రాజ్.