Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సల్మాన్‌ఖాన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భారు' ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. డ్రగ్స్ గురించి చెబుతున్న డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. నగరంలో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయిందంటూ చెబుతున్న డైలాగ్‌లు, దిశాపటానీతో సల్మాన్ సన్నివేశాలు, అలాగే అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' (డీజే)చిత్రంలోని సీటీమార్ రీమేక్ సాంగ్ అందరినీ విశేషంగా అలరిస్తున్నాయి. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా మే 13న రిలీజ్ చేయబోతున్నారు. థియేటర్స్‌తో పాటు ఓటీటీ వేదికల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.