Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి, వెట్రి మారన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'విడుదలై'. ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తొలిసారి వెట్రిమారన్, ఇళయరాజా కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించనుంది.
'కరెంట్, టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోని దట్టమైన పశ్చిమ కనుమల్లోని అడవుల్లో విజయ్ సేతుపతి, వెట్రిమారన్, సూరి, భవాని శ్రీ సహా యూనిట్ మొత్తం అడవుల్లో ఉండే గిరిజన ప్రజలతో ఉంటూ ఈ సినిమా చిత్రీకరణ చేశారు. 'అసురన్' వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత అదే స్థాయి స్ట్రాంగ్ కంటెంట్‌తో దర్శకుడు వెట్రిమారన్ 'విడుదలై' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆకట్టుకునే ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. వైవిధ్యమైన చిత్రాల్లో, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ చిత్రంలోనూ ఓ అద్భుతమైన పాత్రను పోషించారు. ఆయన కెరీర్లోనే గర్వంగా చెప్పుకునే ఈ పాత్రని దర్శకుడు వెట్రిమారన్ డిజైన్ చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే విజయ్ సేతుపతి నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో మరోమారు చూస్తారనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వేల్రాజ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ఎడిటింగ్ వర్క్‌ను ఆర్.రామర్, పీటర్ హెయిన్ యాక్షన్స్ సీక్వెన్స్‌ను సమకూస్తున్న ఈ చిత్రానికి జాకీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో సినిమాని విడుదల చేయడానికి నిర్మాత ఎల్రెడ్ కుమార్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.