Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం 'మేజర్'. శశి కిరణ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మిస్తోంది.
26/11 ముంబై నగరంలో జరిగిన టెర్రర్ ఎటాక్స్‌లో తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్‌గా అడివి శేష్. నటిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని భాషల్లోనూ ట్రెమండస్ రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దర్శకుడు శశికిరణ్ తిక్క, ఆయన టీమ్ ఈ స్క్రిప్ట్‌ను తయారు చేసుకున్నారు. అందుకు తగినట్లు భారీ సెట్స్‌ను వేసి సినిమాని చిత్రీకరిస్తున్నారు. 'మహానటి' వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన అవినాష్ కొల్ల, ఈ సినిమాలోని సన్నివేశాలను రియలిస్టిక్‌గా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. దీని కోసం ఆరు భారీ సెట్స్ వేశారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా సెట్, ఎన్ఎస్జీ కమాండో సెట్లను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్టూడియోలో వేశారు. ఇక ఈ సినిమా కోసం వేసిన భారీ సెట్స్‌లో తాజ్ మహాల్ ప్యాలెస్ సెట్ హైలెట్ అని చెప్పొచ్చు. 2008లో జరిగిన టెర్రర్ ఎటాక్ తాజ్ హోటల్లోనే జరిగింది. ఈ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు ప్రేక్షకులకు రియల్ లొకేషన్ ఫీలింగ్ కలిగించడానికి రియల్ హోటల్ ఎలా ఉందో, అలాంటి సెట్‌నే అవినాష్ కొల్ల వేశారు.
ముంబైలోని తాజ్ హౌటల్లో సన్నివేశాలను చిత్రీకరించాలని యూనిట్ అనుకున్నప్పటికీ వారికి పర్మిషన్ దొరక్కపోవడంతో, ఐదు వందల మంది దాదాపు పది రోజుల పాటు శ్రమించి ఈ భారీ సెట్‌ను నిర్మించారు.
ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం ఆరు భారీ సెట్స్ వేశాం. ప్రతి సెట్ వేసే క్రమంలో మా టీమ్ ఎంతో రీసెర్చ్ చేసి, డిజైన్స్ తయారు చేసుకున్నాం. ముఖ్యంగా తాజ్ పాలెస్ సెట్ వేయడానికి బాగా కష్టపడ్డాం. అడివి శేష్, స్టోరిని నెరేట్ చేసేటప్పుడు తాజ్ హోటల్ ప్రాధాన్యతని వివరించారు. సినిమాలో అదొక సెట్ ప్రాపర్టీలాగా కాకుండా క్యారెక్టర్లా ఊహించుకోవాలని చెప్పారు. దీంతో తాజ్‌లో గ్రాండ్ స్టెయిర్ కేస్, టాటా ఐకానిక్ ఇమేజ్, ఎం.ఎఫ్.హుస్సేన్ పెయిటింగ్స్ వంటి వాటిని రీ క్రియేట్ చేశాం. 120 అడుగుల ఎత్తుతో ఐదు ఫ్లోర్స్ హోటల్ సెట్‌ను ఫైబర్, ఉడ్, ఐరన్ ఉపయోగించి తయారు చేశాం'. ఈ సెట్స్ ఆడియన్స్‌కి సరికొత్త అనుభూతిని అందిస్తాయనే నమ్మనం ఉంది' అని తెలిపారు.