Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్, మేఘ చౌదరి హీరో హీరోయిన్స్‌గా వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కోతి కొమ్మచ్చి'. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి సరికొత్త పంథాలో 2డి యానిమేషన్‌తో థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ యానిమేషన్ వీడియో సాంగ్‌ని నిర్మాత దిల్‌రాజు విడుదల చేసి, టీమ్‌ని అభినందించారు. 'కో కో కో కోతి కొమ్మచ్చి' అంటూ విడుదలైన
ఈ టైటిల్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ అలరిస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు వేగేశ్న సతీష్ మాట్లాడుతూ, 'మా చిత్రం నుండి థీం సాంగ్‌ని రిలీజ్ చేసిన దిల్‌రాజు గారికి ధన్యవాదాలు. కథలో ఓ మంచి సందర్భంలో వచ్చే ఈ పాటను 2డి యానిమేషన్లో విడుదల చేస్తే బాగుంటుందని ఇలా ప్లాన్ చేశాం. అనూప్ ఎనర్జిటిక్ మ్యూజిక్,
శ్రీమణి లిరిక్స్ కలిసి ఈ సాంగ్‌ని అందరికీ నచ్చేలా చేశాయి. సినిమాలో ఈ సాంగ్‌కి మా హీరో హీరోయిన్స్ డాన్స్ చేసినప్పటికీ థీం సాంగ్‌లో మాత్రం కాన్సెప్ట్‌కి తగ్గట్టుగా కోతులతో డాన్స్ చేయించాం. ఇది పిల్లల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుందని అనుకుంటున్నాను. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ కుటుంబ మంతా కలిసి చూసేలా సినిమాను తెరకెక్కించాం' అని అన్నారు. చిత్ర నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ మాట్లాడుతూ, 'ఈ రోజు మా సినిమాలో ఓ మంచి పాటతో ప్రమోషన్ మొదలు పెట్టాం. ఈ సాంగ్ సినిమాలో కూడా స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుందని భావిస్తున్నాం. మంచి మ్యూజిక్ ఇచ్చిన అనూప్‌కి, అలాగే చక్కని సాహిత్యం అందించిన శ్రీమణికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకి సంబంధించి
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కరోన పరిస్థితులు చక్కబడిన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం' అని చెప్పారు.
సంగీత దర్శకుడు అనూప్ రుబెన్స్ మాట్లాడుతూ, 'మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. సతీష్ గారు కథకు తగ్గట్టు మంచి సాంగ్స్ కంపోజ్ చేసే అవకాశం కల్పించారు. ఈ ఆల్బమ్‌లో అన్ని రకాల సాంగ్స్ ఉంటాయి.
అన్నీ పాటలు అందరికీ నచ్చుతాయి. ఈ థీమ్ సాంగ్‌ని ఆదరించి, మంచి విజయం అందిస్తారని ఆశిస్తున్నాను'
అని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్, వి.కే.నరేష్, సిజ్జు, అన్నపూర్ణమ్మ, రాజ శ్రీ నాయర్, మణి చందన, ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ,రచ్చ రవి తదితరులు ఈ చిత్రంలోని ఇతర ముఖ్యతారాగణం.