Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ ఆంటోని, 'మెట్రో' డైరెక్టర్ ఆనంద కష్ణన్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'విజయ
రాఘవన్'. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ, 'రీసెంట్గా విడుదలైన ఈ సినిమా పాటలకు, ట్రైలర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఓ మాస్ ఏరియాలో పిల్లలు పక్క దారులు పట్టకుండా, చదువు గొప్పతనాన్ని వారికి వివరించి, వారి ఉన్నతికి పాటు పడే యువకుడి కథే విజయ్ రాఘవన్. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా తెరకెక్కిస్తున్నాం.
డిఫరెంట్ పాత్ర. కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమా ఉంటుంది. డైరెక్టర్ ఆనంద కష్ణన్ సినిమాను అద్భుతంగా, అన్ని ఎలిమెంట్స్‌ను కవర్ చేస్తూ తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో మే 14న విడుదల చేస్తున్నాం' అని తెలిపారు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.