Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సింహా', 'లెజెండ్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న చిత్రం 'అఖండ'. ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
'ఉగాది కానుకగా 'అఖండ' అనే పవర్ఫుల్ టైటిల్‌తో పాటు మాసీవ్ టైటిల్ రోర్ పేరుతో రిలీజ్ చేసిన టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ టీజర్ 37 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. ఈ టీజర్ సష్టించిన సెన్సేషన్తో ప్రేక్షకాభిమానుల్లో ఈ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి. దీంతో 'సింహా', 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్స్ సరసన ఈ చిత్రం కూడా చేరి హ్యాట్రిక్ హిట్ సాధించడం ఖాయమనే నమ్మకంతో దర్శక, నిర్మాతలు ఉన్నారు. ఏప్రిల్ 30 వరకూ నాన్‌స్టాప్‌గా జరిగే షెడ్యూల్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది' అని చిత్ర బృందం తెలిపింది. బాలకష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రీకాంత్‌తో పాటు భారీతారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్, సంగీతం: తమన్ ఎస్, మాటలు:ఎం.రత్నం, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.