Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయిక తమన్నా తొలిసారి డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పైకి ఎంట్రీ ఇస్తూ నటించిన వెబ్ సిరీస్ 'లెవెన్త్ అవర్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ఆహా'లో కాస్ట్లియస్ట్ వెబ్‌సిరీస్‌గా రూపొందినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమన్నా ప్రధాన పాత్రధారి కావడంతో ఈ సిరీస్ పై ఉన్న అంచనాలను ఏమాత్రం రీచ్ కాలేకపోయింది. కార్పొరేట్ రాజకీయాల నేపథ్యంలో సాగిన ఈ కథ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఈ సిరీస్ సక్సెస్ అయితే 'లెవెన్త్ అవర్' సీజన్‌ని కొనసాగించాలని 'ఆహా' భావించింది. దీని కోసం తమన్నా కూడా అంగీకరించిందట.
అయితే ఈ సిరీస్ ఫ్లాప్ అవ్వడంతో తమన్నాతో మరో సిరీస్‌ని 'ఆహా' ప్లాన్ చేసిందని వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌కి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైందట. తొలి వెబ్‌సిరీస్ భారీ డిజాస్టర్ అయినప్పటికీ మలి సిరీస్ తనకు తప్పకుండా విజయాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని తమన్నా
వ్యక్తం చేస్తోంది. జయాపజయాలు అనేవి ఎక్కడైనా కామనే. ఏది ఏమైనప్పటికీ 'లెవెన్త్ అవర్'లో నేను పోషించిన అరత్రికారెడ్డి పాత్ర నాకెంతో సంతృప్తినిచ్చింది' అని తమన్నా తెలిపింది.