Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో థియేటర్లకు రాలేని ప్రేక్షకులకు వినోదానికి ఏమాత్రం కొదవ లేకుండా ఇటీవల విడుదలైన సినిమాల్లో చాలా వరకు ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతున్నాయి.
వీటిల్లో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ సినిమాలు హల్చల్ చేస్తుంటే, వెండితెరపై వెలవెల బోయిన ఫ్లాప్ సినిమాలు మాత్రం ఓటీటీల్లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
ఇటీవల కాలంలో విడుదలైన 'తెల్లవారితే గురువారం', 'చావు కబురు చల్లగా' చిత్రాలు ప్రేక్షకుల నిరాదరణకు గురయ్యాయి. అపజయాల్ని నమోదు చేసుకున్న ఈ చిత్రాలు ఇప్పటికే 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, వీటికి ముందు విడుదలైన 'జాతిరత్నాలు' సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ మంచి ఆదరణ పొందుతోంది.
ఇక అగ్ర నటుడు నాగార్జున నటించిన తాజా చిత్రం 'వైల్డ్‌డాగ్'. ఈ నెల 2న థియేటర్స్‌లో విడుదలైంది. కోవిడ్ సెకండ్‌వేవ్‌కి భయపడి ఈ సినిమాని ఎక్కువ మంది థియేటర్స్‌లో చూడలేక పోయారని, అయితే ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చని చిత్ర బృందం అధికారింగా ప్రకటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల వెర్షన్స్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే మిలియన్స్‌కి పైగా వ్యూయర్స్ ఈ సినిమాను వీక్షించారు. తెలుగులో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. తమిళంలో టాప్ ఫైవ్‌లో ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లోని సౌత్ఇండియన్ మూవీస్‌లో ఫాస్టెస్ట్, హాయ్యేస్ట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సాధించిన చిత్రంగా 'వైల్డ్‌డాగ్' నిలిచిందని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిథులు పేర్కొన్నారు.