Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరువు హత్యల నేపథ్యంలో రూపొంది అఖండ విజయం సాధించిన చిత్రం 'రంగస్థలం'. పీరియడ్ యాక్షన్-డ్రామా చిత్రంగా తెరకెక్కి అశేష ప్రేక్షకాదరణతో కాసుల వర్షం కురిపించింది. అంతేకాదు జాతీయ స్థాయిలో బెస్ట్ ఆడియోగ్రఫీ అవార్డ్‌ని సైతం సొంతం చేసుకుంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో అప్పటి రాజకీయాలను, పరువు హత్యలను ప్రతిబింబించిన ఈ చిత్రం రామ్‌చరణ్ కెరీర్లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది.
సుకుమార్- రామ్‌చరణ్ కాంబినేషన్లో 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్నారు. తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. 'రంగస్థలం' తమిళ డబ్బింగ్ వెర్షన్ ఈనెల 30న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో శ్రీరామ నవమి కానుకగా విడుదలైన తమిళ 'రంగస్థలం' ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. రామ్‌చరణ్ పవర్ఫుల్ డైలాగ్స్, దేవీశ్రీ ప్రసాద్ అద్భుత నేపథ్య సంగీతంతో ట్రైలర్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిసింది. దీంతో ఈ సినిమాపై అక్కడ కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో మాదిరిగానే తమిళంలోనూ ఈ సినిమా అఖండ విజయం సాధించడం ఖాయమనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. తమిళనాట దాదాపు 300లకు పైగా స్క్రీన్లలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా 'రంగస్థలం' టైటిల్‌తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.