Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల 'శశి' వంటి విజయవంతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యువ కథానాయకుడు ఆది సాయికుమార్. ఆయన తాజాగా నటిస్తున్న నూతన చిత్రం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది.
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జెమినీ సమర్పణలో ఎస్.వీ.ఆర్ ప్రొడక్షన్ పై.లి. పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అమరన్' ఇన్ ది సిటీ-చాప్టర్ 1. అవికా గోర్ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్.బలవీర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎస్.వీ.ఆర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సాయికుమార్ క్లాప్ కొట్టగా, జెమినీ మూర్తి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు.
'వైవిధ్యమైన కథా చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్. కథానాయకుడిగా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించారు. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఇన్నోవేటివ్, యూనిక్ పాయింట్‌తో 'అమరన్ ' ఇన్ ది సిటీ-చాప్టర్ 1' సినిమా తెరకెక్కబోతోంది. గత చిత్రాల కంటే ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఈ పాత్రలో కామిక్ టచ్ కూడా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భారీ బడ్జెట్‌తో సినిమాని రూపొందిస్తున్నారు నిర్మాతలు. అన్కాంప్రమైజ్డ్గా చేయబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌పై మేకర్స్ రెండేళ్లు పాటు శ్రమించారు.
ప్రేక్షకులను ఎంగేజ్ చేసే కథాంశంతో థ్రిల్లర్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఆదిత్య ఓం, కష్ణుడు, మనోజ్ నందన్, వీర్ శంకర్, పవిత్రా లోకేశ్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కష్ణ చైతన్య సంగీత సారథ్యం వహిస్తుండగా శాటి.ఎం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ, 'నా కెరీర్లోనే ఓ వైవిధ్యమైన సినిమా ఇది. అలాగే పాత్ర పరంగా, లుక్ పరంగా కూడా. ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఆద్యంతం ఆకట్టుకునే కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.
ఆది సాయికుమార్, అవికాగోర్, ఆదిత్య ఓం, కష్ణుడు, మనోజ్ నందన్, వీర్ శంకర్, పవిత్రా లోకేశ్, మధు మణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కష్ణ చైతన్య కొల్లి, సినిమాటోగ్రఫీ: శాటి.ఎం, లైన్ ప్రొడ్యూసర్: శ్వేతా కటకం, కాస్ట్యూమ్స్ డిజైనర్: దేవి పరుచూరి, నిర్మాత: ఎస్.వీ.ఆర్, రచన - దర్శకత్వం: ఎస్.బలవీర్.