Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తి చావ్లా ప్రధాన పాత్రలో చిన్నా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన చిత్రం 'ఓ అమ్మాయి క్రైమ్ స్టోరీ'.
సాధికా, ఆధీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నీలగల్ రవి ముఖ్య పాత్రధారులుగా నటించారు. జి.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎ.బి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ సంయుక్తంగా నిర్మించారు. లేడీ ఓరియెంటెడ్ హర్రర్ గ్రాఫిక్స్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎ.బి.శ్రీనివాస్ మాట్లాడుతూ, ' ఇదొక లేడీ ఓరియెంటెడ్ చిత్రం. ఇందులో కీర్తి చావ్లా ముఖ్య పాత్ర పోషించింది. ఇందులో ఉన్న హర్రర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, రొమాంటిక్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. గతంలో విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 30న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం' అని తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాతలు : ఎ.బి.శ్రీనివాస్, ఆర్.సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్, డైరెక్టర్ :జి.సురేందర్ రెడ్డి, ఎడిటర్ :మేనగ శ్రీను.