Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాప్సీ బాలీవుడ్లో నటించిన 'హసీన్ దిల్ రుబా', 'రష్మీ రాకెట్', 'లూప్ లపేటా', 'దొబారా' సినిమాలు ఇప్పటికే షఉటింగ్స్ పూర్తి చేసుకుని, రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అలాగే తాప్సీ టైటిల్ రోల్ పోషిస్తున్న మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ 'శభాష్ మిథూ' షఉటింగ్ దశలో ఉంది. ఇంత బిజీగా ఉన్నప్పటికీ తాప్సీ మళ్ళీ తెలుగులో నటించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే కేవలం హీరోయిన్‌గానే కాదు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో అయినా సరే నటించడానికి సిద్ధంగా ఉందట. 'ఝుమ్మంది నాదం'తో తెలుగు తెరకి పరిచయం అయిన తాప్సీ 'మిస్టర్ పర్ఫెక్ట్', 'గుండెల్లో గోదారి', 'సాహసం', 'ఘాజీ', 'ఆనందో బ్రహ్మ', 'నీవెవరో', 'గేమ్ ఓవర్' వంటి తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.