Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏప్రిల్ 28, 1977.. కమర్షియల్ సినిమాకి సరికొత్త అర్థం చెప్పి, బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త చరిత్ర సష్టించిన కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'అడవిరాముడు' రిలీజైన రోజు. ఈ సినిమా విడుదలై నాలుగు దశాబ్దాలు దాటినప్పటికీ 'అడవి రాముడు' సృష్టించిన కాసుల సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. అలాగే ప్రపంచ చలన చిత్ర చరిత్రలో సంచలనం సష్టించి అంతర్జాతీయ స్థాయిలో బాక్సాఫీస్ రికార్డులకు సరికొత్త అర్థం చెప్పిన 'బాహుబలి 2' విడుదలైన రోజు కూడా ఏప్రిల్ 28. కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆయన శిష్యుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రమిది. అందుకే ఏప్రిల్ 28.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకి చాలా ప్రత్యేకమైన రోజు. తన జీవితంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఏప్రిల్28న దర్శకేంద్రుడు సారథ్యంలో రూపొందుతున్న 'పెళ్ళి సందడి' పాటల సందడి మొదలుకానుంది.
1996లో విడుదలై ఏడాది పాటు ప్రదర్శితమై అద్భుత విజయాన్ని సాధించడమేకాక, పాతికేళ్లుగా బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్గా నిలిచింది చిత్రం 'పెళ్లిసందడి'. అయితే ఇప్పుడు దర్శకేంద్రుడు మళ్లీ ఆ 'పెళ్ళి సందడి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది ఆ 'పెళ్లిసందడి'కి సీక్వెల్ కాదు. ఇదొక కొత్త కథ. నాటి 'పెళ్లిసందడి'లో శ్రీకాంత్ హీరో అయితే నేటి 'పెళ్లిసందడి'లో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తుండటం విశేషం. దర్శకేంద్రుడు, స్వరవాణి కీరవాణి కాంబినేషన్లో అప్పటి 'పెళ్లిసందడి' పాటలు ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. ఈ 'పెళ్లిసందడి'కి కూడా కీరవాణి సంగీతం అందించడం మరో విశేషం. ఈ ఏప్రిల్ 28న రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ 'పెళ్లిసందడి'లోని ఓ పాటను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాటతో మరోసారి కె.రాఘవేంద్రరావు, కీరవాణిల పాటల సందడి మళ్లీ మొదలవుతోంది. ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తయ్యిందని చిత్ర యూనిట్ పేర్కొంది. రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సమర్ఫణ:
కె. కష్ణమోహన్ రావు, నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ, దర్శకత్వం: గౌరీ రోనంకి.