Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు కార్తికి తెలుగు సినిమా టైటిల్స్ బాగా కలిసొచ్చినట్టుంది. అందుకే తన లేటెస్ట్ సినిమాకి కూడా ఓ హిట్ సినిమా టైటిల్‌ని ఫిక్స్ చేశాడు. 'కాష్మోరా', 'చినబాబు', 'దొంగ', 'ఖైదీ' వంటి తదితర తెలుగు టైటిల్స్‌తో ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించిన కార్తి ఈసారి 'సర్దార్'గా సిల్వర్‌స్క్రీన్‌పై మెరవబోతున్నారు.
పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు 'సర్దార్' అనే టైటిల్‌ని ఖరారు చేస్తూ కర్టన్ రైజర్‌ను ఆవిష్కరించింది. ఈ ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా దర్శక, నిర్మాతలు విడుదల చేశారు. పొడవాటి జుట్టు, గుబురు తెల్ల గడ్డంతో సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి ఆసక్తి పెంచాడు కార్తి. జీవీ ప్రకాశ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. భారత్- చైనా మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా అని ఈ వీడియో చెప్పకనే చెప్పేసింది. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాశీ ఖన్నా, రజిషా విజయన్ నాయికలు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.