Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శింబు, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటిస్తున్న బహు భాషా చిత్రం 'మానాడు'. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత సురేష్ కామాచి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండటం విశేషం.
ఈ చిత్రంలో ఆరు నిమిషాల నిడివి గల ఓ షాట్‌ను సింగిల్ షాట్లో చేసి శభాష్ అనిపించుకున్నారు శింబు. ఈ షాట్లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్సన్తోపాటు దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా పాల్గొన్నారు. నటుడిగా శింబు సత్తా ఏంటో ఈ సినిమా మరోమారు నిరూపిస్తుంది. అగ్ర దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నటించడం మరో విశేషం. సంగీత సంచలనం యువన్ శంకర్ రాజా స్వరాలను సమకూరుస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.