Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'థ్యాంక్యూ బ్రదర్'. ఈ చిత్రాన్ని రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి నిర్మించారు. ఓ యువకుడు, గర్భవతి అయిన మహిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అప్పుడు వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు?, వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయనే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. అయితే ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో, పరిస్థితులను దష్టిలో పెట్టుకుని తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'లో మే 7న విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.
''థ్యాంక్యూ బ్రదర్' చిత్ర ట్రైలర్‌ను అగ్ర హీరో వెంకటేష్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచే కాదు, స్టార్స్ ప్రభాస్, మహేష్, రానా దగ్గుబాటి సహా చాలా మంది నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆసక్తికరంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎగ్జయిటింగ్ క్లైమాక్స్ ఇలా.. అన్ని ఎలిమెంట్స్ సరైన పాళ్లతో ఈ సినిమా రూపొందింది. 100% తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'. తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా' క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులకు నేరుగా అందిస్తోంది. గ్రిప్పింగ్ కథనం, వైవిధ్యమైన కథాంశం ఉన్న చిత్రాలను ఆహా తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తుంది.బ్లాక్‌బస్టర్ సినిమాలు, ఒరిజినల్స్, వెబ్ షోస్‌తో ఈ వేసవిలో తెలుగు ప్రేక్షకులకు హౌస్ ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. ఈ ఏడాదిలో క్రాక్, గాలి సంపత్, నాంది, లెవన్త్ అవర్, మెయిన్, తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాల తర్వాత మా చిత్రాన్ని విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది' అని చిత్ర బృందం తెలిపింది. అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, ఆదర్శ్ బాలకష్ణ, మోనికా రెడ్డి, హర్ష చెముడు తదితరులు నటించిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్ రాపర్తి
నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు
సంగీతం: గుణ బాలసుబ్రమణియన్, ఆర్ట్: పురుషోత్తం ప్రేమ్.