Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రతి ముగింపు కూడా ఒక్క ఆరంభానికి నాంది పలుకుతుంది. కొత్త సవ్వడులు వెదజల్లుతుంది. అలాగే కొత్త మలుపులు కూడా జీవితంలో ప్రవేశిస్తాయి. అలాంటి కొత్త మలుపులతోనే మన ముందుకు వస్తుంది జీ తెలుగు వారి కల్యాణ వైభోగం. ఇప్పటివరకు మనలని జై-మంగ గా ఎంతో అలరించిన ఆ రెండు పాత్రలు వారిని ఎంతోగానో అభిమానించే అభిమానులకు వీడుకోలు పలుకుతూ వారి పిల్లలైనా దివ్య మరియు అభి కు స్వాగతిస్తున్నారు. అందరకి ఎంతోగాను నచ్చిన కల్యాణ వైభోగం ఇపుడు 12 ఏళ్ళ తర్వాత దివ్య మరియు అభి జీవితం చుట్టూ తిరగనుంది. మరోసారి మేఘన లోకేష్ ద్విపాత్రాభినయం చేయనుంది దివ్య పాత్రలో. దివ్య తన అన్నయ అయినా అభి కోసం 12 ఏళ్ళ నుంచి వెతుకుతుంది. ఇంత వరకు తన ఆచూకీ తెలీదు. కానీ, తన అన్నయ అంటూ ఇద్దరు వ్యక్తులు తన ముందుకు వస్తారు. మరి ఆ ఇద్దరిలో తన అన్న అభి ఎవరు? నిత్య ఏ విధంగా దివ్య జీవితం తో పాటు అభి జీవితం తో ఆడకుంటుంది అని తెలియాలంటే కల్యాణ వైభోగం లో జరిగే ఈ మార్పు ఈ బుధవారం నుండి చూడాల్సిందే రాత్రి 9: 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లో.