Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో రోజు రోజుకి మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఇప్పటికీ సినిమా థియేటర్లు మూత పడ్డాయి. షూటింగులు సైతం తక్కువ మందితో సాగుతున్నాయి. అలాగే ఇప్పటికే పలు చిత్రాల రిలీజ్లు వాయిదా పడ్డాయి.
ఆచార్య
ఆ పరంపరని కొనసాగిస్తూ తాజాగా 'ఆచార్య' చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ కాంబోలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన ్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తొలుత మే 13వ రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే సెకండ్ వేవ్ దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా వేశారు.
మరక్కర్
మే 13న రిలీజ్ కావాల్సిన మోహన్ లాల్ పాన్ ఇండియా చిత్రం 'మరక్కార్' రిలీజ్‌ని సైతం వాయిదా వేశారు. తాజాగా ఈ ఏడాది ఆగస్ట్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మోహన్‌లాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అర్జున్, సునీల్ శెట్టి, ప్రభు దేవా, ప్రభు, కీర్తీ సురేశ్ నటించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు.
ఏక్ మినీ కథ..
'ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ మాకు ముఖ్యం కాదు. అందుకే మా సినిమా 'ఏక్ మినీ కథ' ను వాయిదా వేస్తున్నాం' అని నిర్మాతలు తెలిపారు. సంతోష్ శోభన్ హీరోగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై కార్తీక్ రాపోలు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 30న రిలీజ్ కావాల్సి ఉంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేస్తామని నిర్మాతలన్నారు.