Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెండున్నర దశాబ్దాలుగా 'పెళ్లిసందడి' చిత్రంలోని పాటలు అందరినీ అలరిస్తున్నాయి. మళ్లీ దర్శకేంద్రుడు, కీరవాణి కాంబినేషన్ నయా 'పెళ్ళి సందడి' చిత్రంతో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రోషన్, శ్రీలీల జంటగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న చిత్రం 'పెళ్లిసందడి'. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి 'ప్రేమంటే ఏంటీ... నువ్వంటే నాకు ధైర్యం..' అంటూ ఆహ్లాదకరంగా సాగే తొలిపాటను బుధవారం మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటకు కీరవాణి క్యాచీ ట్యూన్ ఇవ్వగా, గీత రచయిత చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. హరిచరణ్, శ్వేత పండిట్ శ్రావ్యంగా ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లో ఉంది. రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంతో రాఘవేంద్రరావు, కీరవాణిల పాటల సందడి మళ్లీ మొదలైంది.