Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వినయ విధేయ రామా..' చిత్రంలో ప్రేక్షకులను అలరించిన రామ్‌చరణ్, కైరా అద్వానీ జంట మరోమారు వెండితెరపై మెరవనుందని సమాచారం. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్, సాంకేతిక నిపుణుల ఎంపికపై సోషల్ మీడియాలో భిన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో రామ్‌చరణ్‌కి జోడీగా కైరాని ఎంపిక చేశారని, అలాగే అవినీతిపై అస్త్రాన్ని సంధించే కథతో శంకర్ మరోసారి సెన్సేషన్‌కి సిద్ధమవుతున్నారని, ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా లేదా కలెక్టర్‌గా రామ్‌చరణ్ నటిస్తారని, పవర్ఫుల్ డైలాగ్స్ కోసం 'బిగిల్' రైటర్ వివేక్ని రంగంలోకి దింపారనే వార్తలు హల్చల్ చేస్తున్నప్పటికీ చిత్ర బృందం వీటిపై ఇంతవరకూ స్పందించలేదు.