Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ బారినపడిన టాలీవుడ్ హీరోల జాబితాలోకి తాజాగా అల్లు అర్జున్ చేరారు. తనకి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టుగా సోషల్ మీడియా వేదికగా ఆయన అధికారికంగా ప్రకటించారు. 'పాజిటివ్ కారణంగా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఇటీవల నన్ను కలిసిన వాళ్ళు కూడా టెస్ట్ చేయించుకోండి. అలాగే తప్పకుండా వ్యాక్సిన్ వేయించుకోండి. పాజిటివ్ ఉంది కాబట్టి శ్రేయోభిలాషులు, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బాగానే ఉన్నా. అలాగే ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా' అని బన్నీ తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా 'పుష్ప'లో బన్నీ నటిస్తున్న విషయం విదితమే.