Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం 'హరిహర వీరమల్లు'. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి దృష్ట్యా చాలా సినిమాలు చిత్రీకరణలతో పాటు విడుదల తేదీలను సైతం వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
వీటికి చిత్ర సమర్పకుడు ఎ.ఎం.రత్నం స్పందిస్తూ, 'అనుకున్నట్టుగానే వచ్చే ఏడాది సంక్రాంతికే ఈ సినిమాని విడుదల చేస్తాం. దర్శకుడు క్రిష్ అనుకున్న సమయానికి చిత్రాన్ని పూర్తి చేస్తారు. ఆయన గత చిత్రాలను పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. పైగా సంక్రాంతి.. అంటే ఇంకా చాలా సమయం ఉంది. అందువల్ల మా సినిమా విడుదలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు' అని క్లారిటీ ఇచ్చారు.