Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంధ్య స్టూడియో సమర్పణలో భీమవరం టాకీస్ పతాకంపై టి. రామసత్యనారాయణ నిర్మిస్తున్న హర్రర్ థ్రిల్లర్ 'దెయ్యం గుడ్డిదైతే'. దాసరి సాయిరాం దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్‌ను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. ఆ తరహా చిత్రాలు లెక్కలేనన్ని చూశాను. కానీ దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం ఇప్పటివరకూ చూడలేదు. దాన్ని హైలైట్ చేస్తూ 'దెయ్యం గుడ్డిదైతే' అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది. ఈ సినిమాతో సాయిరామ్ దాసరికి దర్శకుడిగా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను' అని అన్నారు. 'సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మా చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని దర్శక, నిర్మాతలు తెలిపారు. సుమీత్, జాకీర్, హైమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవ, ఎడిటర్: రంగస్వామి, స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డి ఐ: జానీ బాషా.