Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం 'అఖండ'. ఉగాది సందర్భంగా ఈనెల13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో 'అఖండ' టీజర్ విడుదలై యూట్యూబ్‌లో అపూర్వ ఆదరణ పొందింది. కేవలం 16 రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 50 మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ ఇంతటి అఖండ విజయానికి కారణమైన అభిమానులకు, ఆదరించిన ప్రతి ఒక్కరికి 'అఖండ' యూనిట్ అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ''సింహా', 'లెజెండ్' తర్వాత బాలయ్యతో చేస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులకు, అభిమానులకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాటికి ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. బాలయ్య నటవిశ్వరూపాన్ని ఈ సినిమాలో మరోసారి చూస్తారు' అని చెప్పారు. 'అందరి ఎక్స్పెక్టేషన్స్ని అందుకునేలా దర్శకుడు బోయపాటి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. మా ద్వారక క్రియేషన్స్ బ్యానర్లో ఈ సినిమా తప్పకుండా ఒక ప్రస్టేజియస్ సినిమాగా నిలుస్తుంది. బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా నందమూరి అభిమానుల్లో పండగ తీసుకొస్తుంది. ఇప్పుడున్న ఈ కరోనా పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత, త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం' అని చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అన్నారు.