Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గీతానంద్, మిత్ర శర్మ జంటగా దయానంద్ తెరకెక్కిస్తున్న చిత్రం 'బాయ్స్'. శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఒక యూత్ ఫుల్ కాలేజ్ సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. 'రాజా హే రాజా..' అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రచించారు. స్మరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. పాపులర్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఎంతో అద్భుతంగా పాడారు. ఈ పాటకు ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. విశేష శ్రోతకాదరణ పొందడంతో మేకర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. మహిళా నిర్మాత మిత్ర శర్మ ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. ఓ పక్క సినిమాలో నటిస్తూనే, మరోవైపు నిర్మాణ బాధ్యతలను కూడా ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
గీతానంద్, మిత్ర శర్మ, రోనిత్, అన్షుల ధావన్, శ్రీహాన్, జెన్నిఫర్ ఎమ్మాన్యూయేల్, శీతల్ తివారి, సుజిత్, బంచిక్ బబ్లు, కౌశల్ మంద, రమ్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: దయానంద్, సహ నిర్మాత: పడవల బాలచంద్ర, సంగీత దర్శకుడు: స్మరన్, సినిమాటోగ్రఫీ : వెంకట్ ప్రసాద్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, కొరియోగ్రఫీ: జావేద్.