Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగ పెరుమాళ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'ఉత్తమ కలి పురుషుడు'.
ఓటీటీల్లో ఈ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని దక్కించుకుని, మంచి స్పందనతో ప్రేక్షకులను అలరిస్తున్న సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాతలు సందీప్ పొడిశెట్టి, నందకిషోర్ పసుపాల సినిమా గురించి మాట్లాడుతూ, 'కరోనా లాక్డౌన్ కారణంగా థియేటర్స్ ప్రాబ్లమ్ ఉండటంతో గత నెల మార్చి 26న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ ఓవర్సీస్ (యుఎస్, యూకే), ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, ఓడాఫోన్, ఐడియా, హంగామాల్లో మా సినిమా రిలీజ్ అయ్యింది. అలాగే ఆ తర్వాత థియేటర్స్‌లోనూ సినిమా రిలీజై మాకు మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మా సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు. నందు, రుచిర, సుధ, యశ్వంత్, శ్రావణ్, పవన్, సాయి, విక్కీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం : శశాంక్ భాస్కరుని, సాహిత్యం : సురేష్ కడారి, సినిమాటోగ్రఫీ : తాజ్.