Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ తమిళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కె.వి.ఆనంద్ (54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆనంద్కి కూడా పాజిటివ్ ఉండటంతో శ్వాస తీసుకోవడంలో సమస్యలొచ్చాయి. చికిత్స నిమిత్తం హాస్పిటల్లో జాయిన్ అయిన ఆయనకు శుక్రవారం తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురై హార్ట్ ఎటాక్‌తో మరణించినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
అలాగే కోవిడ్ నిబంధనల దష్ట్యా మతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడం కుదరదని చెప్పిన ఆస్పత్రి ప్రతినిధులతో హీరో సూర్య మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. కె.వి.ఆనంద్ మతిపై చిత్ర తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాయి.
చెన్నైలో పుట్టి పెరిగిన కె.వి.ఆనంద్ ఫ్రీ లాన్స్ ఫొటో జర్నలిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. 'కల్కి', 'ఇండియా టుడే' దిన పత్రికల్లో పని చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దగ్గర సినిమాటోగ్రఫీలో శిష్యుడిగా చేరారు.
ఆయన సినిమాటోగ్రఫీ వహించిన తొలి చిత్రం 'తెన్ మావిన్ కొంబాత్' (1994) చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత 'ప్రేమదేశం', 'ఒకే ఒక్కడు', 'శివాజీ' వంటి తదితర చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 'కణా కండేన్' (2005) సినిమాతో దర్శకుడిగానూ మారారు. సూర్యతో వీడొక్కడే (అయాన్)తో హిట్ కొట్టి దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసిన ఆనంద్ జీవాతో తెరకెక్కించిన రంగం(కో) సినిమాతో అటు తమిళ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల దష్టిని ఆకర్షించారు. తర్వాత బ్రదర్స్ (మాట్రాన్), అనేకుడు (అనేగన్), కవన్, బందోబస్త్ (కాప్పాన్) చిత్రాలను తెరకెక్కించారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో దాదాపు 17 చిత్రాలకు అద్భుతమైన ఫొటోగ్రఫీ అందించారు. అలాగే కేవలం 7 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించినప్పటికీ ప్రతి సినిమా దేనికదే వైవిధ్యంగా ఉండటంతోపాటు పలు అంశాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంతో ఆనంద్కి తెలుగు, తమిళ పరిశ్రమల్లో ఓ ప్రత్యేక ఇమేజ్ లభించింది. 'మీరా', 'శివాజీ', 'బ్రదర్స్', 'కవన్' వంటి తదితర చిత్రాల్లో నటుడిగానూ ప్రేక్షకులను అలరించిన ఆనంద్ మృతిపట్ల పలువురు అగ్రకథానాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
కె.వి.ఆనంద్ మరణవార్త నన్ను షాక్‌కు గురి చేసింది. ఆయన ఇకపై మన మధ్య ఉండరంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. - రజనీకాంత్
మ్యాగజైన్ ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి.. సినిమాటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుని.. దర్శకుడిగా విభిన్న చిత్రాలు తెరకెక్కించిన కె.వి.ఆనంద్ మరణవార్త నన్ను కలచివేసింది. ఆయన మరణం సినీరంగానికి ఓ పెద్ద లోటు. - కమల్‌హాసన్
ఇకపై మీరు మా కంటికి కనిపించకపోవచ్చు. కానీ, మా హదయాల్లో ఎప్పటికీ మీరు చిరస్మరణీయం. - మోహన్‌లాల్