Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పటి కథానాయికల్లా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలనే ఆలోచనలో ప్రస్తుత తరం నాయికలు లేరు. కథేంటి?, అందులో తమ పాత్ర ఏంటి?, దర్శక, నిర్మాతలెవరు.. వంటి తదితర అన్ని అంశాలూ నచ్చితేనే గ్రీన్‌సిగల్ ఇస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉంటే ఎటువంటి మొహమాటం లేకుండా 'నో..' అని చెప్పేస్తున్నారు. తాజాగా రెండు ప్రాజెక్టులకు కథానాయికలు సాయిపల్లవి, కృతిశెట్టి 'నో..' చెప్పారని సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఛత్రపతి' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయిక కోసం చిత్ర బృందం సాయి పల్లవిని సంప్రదిస్తే డేట్స్ సర్దుబాటు చేయలేనని చెప్పిందట. అలాగే 'ఉప్పెన' వంటి బ్లాక్‌బస్టర్‌తో స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందిన కృతిశెట్టి సైతం డేట్స్ కారణంగానే అగ్ర దర్శకుడు తేజ సినిమాకి 'నో' చెప్పినట్టు తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా తేజ 'అలిమేలుమంగ వేంకటరమణ' సినిమాని రూపొందిస్తున్నారు.