Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమా రెండు భాగాలుగా రాబోతోందనే గాసిప్ నిజమేనని నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప' గురించి నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ,''పుష్ప' కథకు ఉన్న స్పాన్కి ఒక్క పార్ట్‌లో చెప్పడం కుదరదు. అందుకే దర్శకుడు సుకుమార్‌తో చర్చించి దీన్ని రెండు పార్ట్స్‌గా చేయాలని ఫిక్స్ అయ్యాం' అని చెప్పారు.
కరోనా పాజిటివ్ కారణంగా 15 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్న బన్నీకి నెగటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన బుధవారం తన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగంతో తన పిల్లలను హత్తుకున్నారు.