Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమల నుంచి సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. అలాగే సోనూసూద్ తన సేవలను మరింత విస్తృతం చేశారు. ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో ఆయన ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికే శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్, అనుష్కశర్మ రెండు కోట్ల రూపాయల చొప్పున కోవిడ్ బాధితుల సహాయార్థం విరాళంగా ఇచ్చారు. వీరి బాటలోనే కరోనాపై పోరాటం చేసేందుకు హీరో సూర్య కుటుంబం కోటి రూపాయల సాయాన్ని అందించింది. కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రజలకు వైద్య సదుపాయం అందకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటం చేయడానికి హీరో సూర్య తన తండ్రి శివ కుమార్, సోదరుడు హీరో కార్తితో కలిసి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలను విరాళాన్ని అందించడం అభినందనీయం.