Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా ప్రజలందరికీ నరకం చూపిస్తోంది. ఇటువంటి తరుణంలోనూ కోవిడ్ బాధితుల ప్రాణాలను నిలిపేందుకు నర్సులు అహర్శిశలు శ్రమిస్తున్నారు. అధిక పని ఒత్తిడి ఉన్నప్పటికీ రోజుల తరబడి ఆస్పత్రులకే పరిమితమవుతున్నారు. వారు చేస్తున్న త్యాగంతోనే మనం ఈ మాత్రం సురక్షితంగా ఉండ గలుగుతున్నాం అంటూ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వారి త్యాగాలను కొనియాడారు. 'కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగుల ప్రాణాలను కాపాడుతున్న నర్సుల సేవలు ఆసారధరమైనవి' అని హీరో మహేష్‌బాబు అన్నారు. 'భారత్ కరోనా సెకండ్‌వేవ్‌తో పోరాడుతోంది. ఈ కష్ట సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా ఉండి మాకు రక్షణగా ఉంటూ నర్సులు చేస్తున్న అసాధారణ సేవలు అసమానం. జీవితంపై ఆశను కోల్పోకుండా మాలో ధైర్యాన్ని నింపుతున్నందుకు మీకు రుణపడి ఉంటాం' అని మహేష్ ట్వీట్లో పేర్కొన్నారు. మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారివారి పాట'లో నటిస్తున్నారు.