Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ సరసన 'భరత్ అనే నేను' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కైరా అద్వానీ ఆ తర్వాత 'వినయ విధేయ రామ' చిత్రంలో రామ్‌చరణ్ సరసన మెరిసింది. తొలి చిత్రం బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ రెండో సినిమా డిజాస్టర్ అవ్వడంతో కైరాకు తెలుగునాట ఆఫర్లు రాలేదు. దీంతో బాలీవుడ్‌పై ఫోకస్ చేసి అక్కడ సక్సెస్ఫుల్ హీరోయిన్గా నిరూపించుకుంది.
ఇక 'లస్ట్ స్టోరీస్' వంటి హాట్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఫ్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం 'షేర్షానీ', 'భూల్ భలయ్యా 2', 'జగ్ జగ్ జియో', 'మిస్టర్ లీలే' వంటి హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో కైరాని నాయికగా ఎంపిక చేసినట్టు వినిపిస్తోంది. కొరటాల శివ 'భరత్ అనే నేను'లో కైరా నటించింది. పలు ప్రాజెక్టులతో డేట్ల ఇబ్బంది ఉన్నప్పటికీ కొరటాల సినిమా అనేసరికి కైరా వెంటనే పచ్చ జెండా ఊపిందని సమాచారం.