Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికల పెళ్ళిళ్ళ విషయం ఎప్పుడూ హాట్ టాపిక్కే. వీళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఎప్పుడూ ఏదో ఒక గాసిప్ హల్చల్ చేస్తుండటమే ఇందుకు కారణం. తాజాగా కథానాయిక రష్మిక మందన్నా పెళ్ళి గురించి స్పందిస్తూ తన మనసులోని మాటని బయట పెట్టింది. ప్రేమించిన కన్నడ హీరో రక్షిత్‌శెట్టితో రష్మికకు నిశ్చితార్థం కూడా జరిగిన విషయం విదితమే. ఆ తర్వాత వీరిద్దరి మధ్య బ్రేకప్ కూడా అయ్యింది. అప్పట్నుంచి పెళ్ళి టాపిక్‌కి దూరంగా ఉన్న రష్మిక ఉన్నట్టుండి పెళ్ళి గురించి మాట్లాడ్డంతో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యింది. 'నాకు తమిళ సంస్కతి, సంప్రదాయం అంటే చాలా ఇష్టం. అక్కడి భోజనం, వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. తమిళ వంటకాలంటే నాకెంతో ఇష్టం. ఎప్పటికైనా తమిళవాసుల ఇంటి కోడలు కావాలన్నదే నా కోరిక' అని రష్మిక తెలిపింది.ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప', శర్వానంద్ కథానాయకుడిగా చేస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు'లోనూ నటిస్తోంది. అలాగే ఇటీవల కార్తీ సరసన 'సుల్తాన్' సినిమాలో నటించి తమిళ ప్రేక్షకులకూ బాగా దగ్గరైంది. టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్లో సిద్ధార్థ మల్హోత్రా సరసన 'మిషన్ మజ్ను'తో పాటు అమితాబ్ బచ్చన్‌తో కలిసి 'గుడ్‌బై' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది.