Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్తాఫ్ హాసన్, శాంతిరావు, సాత్విక్జైన్, లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం 'బట్టల రామస్వామి బయోపిక్కు'. రామ్ నారాయణ్ దర్శకుడు. సతీష్ కుమార్.ఐ, రామ్ వీరపనేనిలు కలసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగాలో శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్‌తో హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, 'జీ 5లో విడుదలైన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. మా సినిమాకి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మీడియాకి కృతజ్ఞతలు. మ్యాంగో టీవీ రామ్ మా సినిమా చూసి, నచ్చి రిలీజ్ చేద్దామంటూ ముందుకొచ్చారు. ఆయన వల్లే ఈ విజయం సాధ్యమైంది. కోవిడ్ పరిస్థితులు దష్ట్యా ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇక మా డైరెక్టర్ రామ్ నారాయణ్ నాకు తమ్ముడుతో సమానం. నా బ్యానర్ నుంచి ఆయన డైరెక్టర్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. నేను వెంకటేశ్వర స్వామిని, ఆ తర్వాత కథని బాగా నమ్ముతాను. నటీనటులు అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక్ జైన్, లావణ్య రెడ్డి, భద్రం, ధనరాజ్ తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు. పక్కా పల్లెటూరు నేపథ్యంలో సాగే చిత్రమిది. 'కేరాఫ్ కంచరపాలెం' తరహాలో ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందుతుందని ఆర్టిస్టులందరు చాలా సహజంగా నటించారు. చాలా మంది రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ హీరోతో ఈ సినిమా చేయమన్నారు. కథలో కంటెంట్ ఉండటంతో కొత్తవారికి అవకాశం కల్పించాను. సెవెన్ హిల్స్ బ్యానర్లో 'అందరి బంధువయా' తర్వాత ఈ సినిమా చేశాం. అలాగే పూర్ణ నటిస్తున్న 'బ్యాక్ డోర్' చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాం. అలాగే పాయల్ రాజ్‌ఫుత్ హీరోయిన్గా ఉగాది పర్వదినాన కొత్త సినిమాని స్టార్ట్ చేశాం' అని తెలిపారు.