Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయికగా నటిస్తూనే ఛాన్స్ దొరికితే స్పెషల్సాంగ్స్లోనూ పూజా హెగ్డే మెరుస్తోంది. ప్రస్తుతం అఖిల్‌తో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రంలో నటిస్తున్న పూజా 'పుష్ప'సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందని సమాచారం.
మహేష్ సినిమాలో సుమంత్..!
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటీవల ఓ కొత్త సినిమాని ఎనౌన్స్ చేసిన విషయం విదితమే. కష్ణ పుట్టినరోజైన మే 31న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. సమ్మర్ స్పెషల్‌గా విడుదలవ్వబోయే ఈ చిత్రంలో సుమంత్ ఓ కీలక పాత్ర చేయబోతున్నారని టాక్.
నంద్యాల రవి కన్నుమూత
రచయిత, దర్శకుడు నంద్యాల రవి కరోనా కారణంగా శుక్రవారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కరోనాతో హాస్పిటల్లో చేరిన రవి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో సప్తగిరి, నిర్మాత కె.కె.రాధామోహన్ లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.