Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు జీవన్ కుమార్ చేస్తున్న సాయం చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. గతేడాది కరోనా కష్టకాలంలోనూ నిత్యావసర వస్తువులు, కూరగాయలు, భోజనం పంపిణీ చేసిన జీవన్ కుమార్ ఆయన టీమ్ సేవలు ఇప్పుడు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. మూడు వందల కరోనా పేషెంట్స్‌కు రోజూ కడుపు నింపుతూ, ఎలాంటి సహాయం అయినా తన శక్తికి మించి అందిస్తున్న జీవన్ పెద్ద మనసును అందరూ కొనియాడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడంలోని ట్రైబల్ ఏరియాలకు 10వేల కేజీల రైస్‌ని పంపిణీ చేశారు. ఆక్సిజన్ కొరత అధికంగా ఉండటంతో 200 సిలెండర్స్ని అత్యవసర కేసులకు అందించారు. మాస్క్‌లు, శానిటైజర్స్ అందుబాటులో లేని పేదల ఇంటికి తిరిగి పంపిణీ చేసి, వాటిపై అవగాహన కల్పిస్తున్నారు. నటుడిగా 'ఈ నగరానికి ఏమైంది' సినిమా నుంచి మొదలైన ప్రయాణాన్ని ఆయన సక్సెస్‌పుల్‌గా కొనసాగిస్తున్నారు. ఇటీవల 'జాతిరత్నాలు' సినిమాలో పోషించిన ఆయన పాత్రకు మంచి గుర్తింపు లభించడం విశేషం.