Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నంలో కథానాయిక సమంత మంచి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. అలాగే తనకంటూ ఓ ప్రత్యేక అభిమానగణాన్ని సైతం దక్కించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల కోసం వేచి చూసినట్టే, సమంత సినిమాల కోసం కూడా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వచ్చిన స్టార్ స్టేటస్‌ని పదిలం చేసుకుంటూ టైమ్లీగా పంథాని మార్చుకుంటోంది సమంత. సినిమాల్లో మాదిరిగానే డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో కూడా తన మార్క్ ఇమేజ్ ఉండాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా విలన్‌గా బోల్డ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్, డీకే సంయుక్తంగా రూపొందిస్తున్న 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌లో సమంత నటిస్తోంది. వచ్చే వారంలో దీని ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్లో సమంతకి సంబంధించి క్యారెక్టరైజేషన్‌ని పరిచయం చేయబోతున్నారు. థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా 'ఫ్యామిలీ మ్యాన్' విశేష ఆదరణ పొందింది. మనోజ్ బాజ్పారు కీలక పాత్రధారిగా నటించిన ఈ వెబ్ సిరీస్‌కి కొనసాగింపుగా 'ఫ్యామిలీ మ్యాన్ 2'ని నిర్మించారు. జూన్‌లో ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే, సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శాకుంతలం' పాన్ ఇండియా సినిమాలోను, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కాతు వాకుల రెండు కాదల్' తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించడం
విశేషం.