Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగార్జున తనయుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్‌కి చెప్పుకునే స్థాయిలో ఇంతవరకు ఒక్క హిట్ కూడా లేదు. వి.వి.వినాయక్‌లాంటి అగ్ర దర్శకుడితో చేసిన తొలి సినిమా 'అఖిల్' బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మరో పాపులర్ దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో చేసిన 'హలో' సినిమా కూడా ప్రేక్షకుల నిరాదరణ పొందింది. అలాగే 'మిస్టర్ మజ్ను' సైతం పరాజయాన్నే చవిచూసింది. అయితే ఒక్కో సినిమాతో నటుడిగా మాత్రం అఖిల్ అందరినీ ఆకట్టుకుంటున్నారు. డాన్సులు, ఫైట్ల విషయంలో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' లాంటి క్లాస్ సినిమాని, సురేందర్ రెడ్డితో 'ఏజెంట్' వంటి యాక్షన్ థ్రిల్లర్‌ని అఖిల్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ స్టయిలీష్‌గా మేకోవర్ అయిన తీరు అందర్నీ షాకయ్యేలా చేసింది. చేస్తున్న సినిమాలన్ని అగ్ర దర్శకులతో అయినప్పటికీ విజయం దక్కించుకోలేని తనయుడికి నాగార్జున ఎలాగైనా ఓ బిగ్గెస్ట్ హిట్ ఇవ్వాలని సంకల్పించినట్టున్నారు. అందుకే ఈసారి కూడా రంగంలోకి ఓ పెద్ద దర్శకుడిని దింపబోతున్నారట. కొరటాల శివతో ఓ సినిమా చేసేందుకు నాగ్ చర్చలు జరిపినట్టు సమాచారం. ప్రస్తుతం చేస్తున్న సినిమాల తర్వాత అఖిల్‌తో సినిమా చేయడానికి కొరటాల కూడా రెడీగా ఉన్నట్టు టాక్. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్‌తో సినిమాలు చేయాల్సి ఉంది. వీటి తర్వాతే అఖిల్‌తో సినిమా ఉండే ఛాన్స్ ఉంది.